‘పుష్ప’ రష్యా రిలీజ్ పై భారీ అంచనాలు

‘పుష్ప’ రష్యా రిలీజ్ పై భారీ అంచనాలు

Published on Nov 30, 2022 1:30 AM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సూపర్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తీసిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప ది రైజ్ గత సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మించగా దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందించారు. ఇక దీనికి సీక్వెల్ అయిన పుష్ప ది రూల్ మూవీ త్వరలో ప్రారంభం కానుండగా మరోవైపు పుష్ప ది రైజ్ మూవీని డిసెంబర్ 8న గ్రాండ్ గా రష్యా దేశంలో రష్యన్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది యూనిట్.

నేడు రష్యన్ లాంగ్వేజ్ ట్రైలర్ రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ ఫ్యాన్స్ నుండి మంచి స్పందన లభిస్తోంది. మరోవైపు పుష్ప ది రైజ్ మూవీ యొక్క ప్రీమియర్స్ కోసం ఇప్పటికే హీరో అల్లు అర్జున్ తో సహా కీలక టీమ్ సభ్యులు రష్యా బయల్దేరి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు పుష్ప కి అక్కడి ఆడియన్స్ లో సూపర్ గా క్రేజ్ ఉండడంతో తప్పకుండా మూవీ అక్కడ కూడా ఘన విజయం సాదిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు