‘వాల్తేరు వీరయ్య’ సెకండ్ సాంగ్ పై భారీ హైప్

‘వాల్తేరు వీరయ్య’ సెకండ్ సాంగ్ పై భారీ హైప్

Published on Dec 15, 2022 10:49 PM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ కమర్షియల్ మూవీ వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. చాలా గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి మీరొక్కసారి ఊర మాస్ రోల్ చేస్తున్న ఈ మూవీ నుండి ఇటీవల ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, అలానే రవితేజ టీజర్ రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకున్నాయి. అలానే కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ బాస్ పార్టీ విశేషమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.

ఇక ఈ మూవీ నుండి నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా అనే పల్లవితో సాగె సెకండ్ సాంగ్ యొక్క ప్రోమో ని నిన్న మెగాస్టార్ చిరంజీవి చిన్న వీడియో బైట్ ద్వారా రిలీజ్ చేసారు. కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ సాంగ్ ఫుల్ జోష్ తో సాగడంతో పాటు దీనిని ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ అద్భుతంగా ఆలపించారట. ఫ్రాన్స్ లో పలు అందమైన లొకేషన్స్ మధ్య అటు మెగాస్టార్ చిరంజీవి, ఇటు శృతి హాసన్ అత్యద్భుతంగా స్టెప్స్ వేసిన ఈ సాంగ్ ఈ వారాంతంలో రిలీజ్ కానుంది. కాగా వాల్తేరు వీరయ్య మూవీ 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు