‘భవదీయుడు భగత్ సింగ్’ కోసం భారీ ప్లానింగ్స్ …?

‘భవదీయుడు భగత్ సింగ్’ కోసం భారీ ప్లానింగ్స్ …?

Published on Oct 23, 2022 3:01 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 2012లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ అప్పట్లో ఎంతో పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన దబాంగ్ కి రీమేక్ గా తెరకెక్కింది. ఇక మళ్ళి దాదాపుగా పదేళ్ల తరువాత మరొక్కసారి త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ మూవీ తీసేందుకు రెడీ అయ్యారు మాస్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు.

ప్రస్తుతం క్రిష్ తో హరిహర వీరమల్లు మూవీ చేస్తోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ తరువాత భవదీయుడు మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ తరువాత మూవీ పై అందరిలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విషయం ఏమిటంటే, అతి త్వరలో ఈ మూవీ యొక్క షూట్ ప్రారంభానికి సంబంధించి అప్ డేట్ రానున్నట్లు తెలుస్తోంది. నిజానికి మరోవైపు పవన్ కళ్యాణ్ మరొక రీమేక్ సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అయితే ఇప్పటికే కమిట్ అయిన భవదీయుడు మూవీ వీదిలైనంత త్వరగా కంప్లీట్ చేసేందుకు ముందుగా ఆయన కాల్షీట్స్ కేటాయించనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. మరోవైపు మూవీ కోసం అతి త్వరలో యూనిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా గ్రాండ్ లెవెల్లో ప్రారంభించనుందట. ఎంతో భారీ స్థాయిలో అత్యద్భుత రీతిలో దర్శకుడు హరీష్ శంకర్ అన్ని వర్గాల ఆడియన్స్ ని పవన్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా రీతిలో ఈ మూవీని రూపొందించనున్నారట. అయితే ఈ మూవీ షూట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో యూనిట్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ మాత్రం రావలసి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు