‘అర్జున్ రెడ్డి’ చిత్ర హక్కుల్ని దక్కించుకున్న ప్రముఖ నిర్మాత !


తెలుగునాట మాత్రమే కాక ఇతర పరిశ్రమల ప్రేక్షకుల్ని కూడా విశేషంగా ఆకట్టుకుంటున్న సినిమా ‘అర్జున్ రెడ్డి’. నూతన దర్శకుడు సుందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం మొదటి రోజు మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని వసూళ్ల పరంగా ప్రభంజనం సృష్టిస్తోంది. దీంతో ఇతర పరిశ్రమల నిర్మాతలు ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం పోటీపడుతున్నారు.

ముందుగా తమిళ హక్కుల్ని హీరో ధనుష్ దక్కించుకోగా కన్నడ హక్కుల్ని ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ దక్కించుకున్నారు. అయితే ఈ రీమేక్లో ఎవరు నటిస్తారు, ఏ దర్శకుడు సినిమనకు డైరెక్ట్ చేస్తారు అనేది ఇంకా తెలియలేదు. ఇక ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండకు ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ దక్కడం, అతని నటనకు ప్రశంసలు వర్షం కురుస్తుండటంతో పలువురు అగ్ర హీరోలు అర్జున్ రెడ్డి పాత్రలో నటించాలని తహ తహలాడిపోతున్నారు.