చిరు, పవన్ లతో ఎప్పటికైనా మల్టీ స్టారర్ చేస్తానంటున్న బడా నిర్మాత !

allu arvind

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో ఎప్పటికైనా మల్టీ స్టారర్ సినిమా చేసి తీరుతానని అంటున్నారు. నిన్న జరిగిన ‘తేజ్ ఐ లవ్ యు’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆయన పవన్ తో ‘తొలిప్రేమ’ సినిమా చేసినప్పుడు అసలు కరుణాకరన్ ఎవరో చూద్దామని సెట్స్ కి వెళ్ళాను. అక్కడే అతన్ని ‘చిరంజీవి, పవన్ లతో ఒక మల్టీ స్టారర్ చేయాలనుకుంటున్నా దాన్ని నువ్వే డైరెక్ట్ చేయాలి అన్నాను.

అంతే కరుణాకరన్ కంగారుపడిపోయి, సర్ అంత బరువు నా మీద పెట్టకండి. నాకిప్పుడే కంగారుగా ఉంది అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. భవిష్యత్తులో తప్పకుండా ఆ సినిమా చేసి తీరుతాను’ అన్నారు. ఇకపోతే గతంలో టి.సుబ్బరామిరెడ్డిగారు కూడ త్రివిక్రమ్ దర్శకుడిగా చిరు, పవన్ లతో మల్టీ స్టారర్ సినిమాను ప్రకటించగా అదింకా కార్య రూపం దాల్చలేదు.

Exit mobile version