లేటెస్ట్..ఈ తరహా సినిమాలకు ఏపీ ప్రభుత్వం నుంచి ఊరట.?

Published on Dec 24, 2021 7:59 am IST


గత కొన్ని నెలల నుంచి కూడా ఏపీలో థియేటర్స్ కి సంబంధించి కానీ అలాగే టికెట్ ధరల విషయానికి సంబంధించి కానీ నడుస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ సినిమా అయినా కూడా ఒకటే టికెట్ రేటు ఉంటుంది అని ప్రభుత్వం కొత్త జివో లు, విధానాలు, ధరలు ప్రవేశ పెట్టడంతో ఊహించని మలుపులు మొదలయ్యాయి.

ఈ ధరలతో మేము బ్రతకలేం అంటూ స్వచ్చందంగా థియేటర్స్ మూసేసి పరిస్థితికి థియేటర్స్ వారు ఏపీలో వచ్చేసారు. అయితే ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ అంశం బ్రేకింగ్ న్యూస్ గా నడుస్తుంది. అయితే నిన్నటితో భారీ సినిమాలకు ఊరటనిచ్చే సూచనలు ఏపీ ప్రభుత్వం నుంచి ఉన్నట్టుగా తెలుస్తుంది.

వందలాది కోట్లు బడ్జెట్ పెట్టే సినిమాలకు అంటే ధరలు పెంచే అవకాశం ఇస్తాం కానీ చిన్న సినిమాలకు కూడా ధరలు పెంచమంటే ఎలా అన్నట్టుగా చెప్తున్నా మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనితో ఇక రాబోయే “RRR”, “రాధే శ్యామ్” లాంటి సినిమాలకు ఎలాంటి అడ్డంకి ఉండదని అనుకోవచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఏమన్నా వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :