లేటెస్ట్ : “RRR” కి రిలీఫ్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..ఎంతమేర ధర పెరిగింది అంటే?

Published on Mar 15, 2022 1:01 pm IST


ప్రస్తుతం పాన్ ఇండియా వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. ఇండియాస్ టాప్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కానుండగా ఈ సినిమాకి సంబంధించి ఏపీలో కొత్త ధరలపై కాస్త ఆసక్తి గత కొన్ని రోజులు నుంచి నెలకొంది.

అయితే మళ్ళీ రాజమౌళి ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ని కోరనున్నారని కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ భారీ సినిమాకి బిగ్ రిలీఫ్ దొరికినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి గాను అదనంగా 100 రూపాయలు హైక్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది అట. ఇది ఈ సినిమాకి నిజంగానే మంచి మూవ్ అని చెప్పాలి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం :