‘వారణాసి’ బిగ్ రివీల్ తో మరో ఇంట్రెస్టింగ్ థియరీ! ‘కల్కి’ స్టైల్ లో?

ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి వస్తున్న సినిమాల్లో ప్రపంచ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా నుంచి కేవలం ఒక కాన్సెప్ట్ టీజర్ ని విడుదల చేసి రాజమౌళి భారీ లెవెల్ అంచనాలు సెట్ చేశారు.

ఇక ఇందులోనే రామాయణంలో కీలక ఘట్టాన్ని కూడా రివీల్ చేశారు. కానీ లేటెస్ట్ గా సినిమా రచయిత, జక్కన్న తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన బిగ్ రివీల్ ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. రామాయణ ఎపిసోడ్ లో వార్ కేవలం రామునికి, కుంభకర్ణుడికి మాత్రమే అని అసలు విషయం చెప్పేసారు.

అయితే చాలా మంది ఈ ఎపిసోడ్ రావణ పాత్రతో కూడా ఉంటుంది అని భావించి ఉండొచ్చు కానీ ఇది కేవలం రాముడికి కుంభకర్ణుడి నడుమ జరిగే పతాక సన్నివేశం అని క్లారిటీ ఇచ్చేసారు. అయితే ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ థియరీ కనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రను వెర్సటైల్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక్కడ గమనిస్తే రామాయణ ఎపిసోడ్ కేవలం మహేష్ పోషించిన రామునికి అలానే కుంభ కర్ణుడికి నడుమ మాత్రమే ఉంటుంది. అలాగే ఫ్యూచర్ ప్రపంచంలో పృథ్వీ రాజ్ పాత్రని కూడా ‘కుంభ’ గా పరిచయం చేశారు. అక్కడ కుంభకర్ణుడు, ఇక్కడ కుంభ సో ఓ ఇంట్రెస్టింగ్ లింక్ కనిపిస్తుంది. సో కుంభ కంటే మరో పవర్ఫుల్ విలన్ కూడా సినిమాలో ఉంటాడా? అనే ప్రశ్న ఇక్కడ లేవనెత్తుతుంది.

ఇదిలా ఉంటే ఇదే ఫార్మాట్ ప్రభాస్, నాగ్ అశ్విన్ ల కల్కి 2898 ఎడి లో కూడా గమనించవచ్చు. కల్కి లో యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కీన్ మోస్ట్ పవర్ఫుల్ విలన్ కానీ తనకి మించిన కనిపించని విలన్ ‘కలి’ లేదా తనకి ప్రతిరూపం కూడా కావచ్చనే మరో థియరీ ఉంది. సో మనకి ప్రెజెంట్ చేసిన విలన్స్ ని మించి మరింత సర్ప్రైజ్ చేసే అంశాలు ఈ రెండు సినిమాల్లో ఉన్నాయా అనేది మాత్రం కాలమే రివీల్ చేయాలి.

Exit mobile version