ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందరూ ఎదురుచూస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ ఈ ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొదటి భాగం సాధించిన ఘనవిజయంతో, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
గతంలో మొదటి భాగం గల్ఫ్ దేశాల్లో నిషేధానికి గురవ్వడంతో నిర్మాతలు దాదాపు 100 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారు. అయితే, డిజిటల్ విడుదలై తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో గల్ఫ్ దేశాల్లోనే అత్యధికంగా వీక్షించిన భారతీయ చిత్రంగా ‘ధురంధర్’ రికార్డు సృష్టించింది. పాకిస్థాన్‌లో కూడా ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభించింది.
ఈసారి గల్ఫ్ దేశాల్లో సెన్సార్ అడ్డంకులను దాటుకుని సినిమాను విడుదల చేయడం మేకర్స్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఒకవేళ అక్కడ విడుదలకు మార్గం సుగమం అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం ఖాయం. మొదటి భాగంలో చేసిన చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకుంటూ ఈసారి చిత్రాన్ని అత్యున్నత స్థాయిలో రూపొందించారు.
