బిగ్ సర్ప్రైజ్ కి రెడీ అయిన విజయ్ దేవరకొండ ‘లైగర్’

బిగ్ సర్ప్రైజ్ కి రెడీ అయిన విజయ్ దేవరకొండ ‘లైగర్’

Published on Aug 18, 2022 1:00 AM IST

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ల తొలి కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ మాస్ యాక్షన్ కమర్షియల్ మూవీ ‘లైగర్’ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై నిర్మితం అయిన ఈ పాన్ ఇండియా మూవీ పై భారతదేశంలోని పలు భాషల ఆడియన్స్ అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అనన్య పాండే హీరోయిన్ గా కనిపించనున్న లైగర్ నుండి ఇటీవల రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతం పెంచేసింది.

మరోవైపు మూవీ కి సంబంధించి ఇప్పటికే ఇండియా లోని ప్రముఖ లొకేషన్స్ లో ఫ్యాన్డం టూర్స్ చేస్తూ ఆడియన్స్ లో మూవీ పై మరింత క్రేజ్ పెంచుతోన్న యూనిట్, రేపు ఒక సర్ప్రైజ్ ని అనౌన్స్ చేయబోతున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అయితే ఈ సర్ప్రైజ్ ట్విట్టర్ కి సంబంధించింది కావడంతో ఒకవేళ లైగర్ ఎమోజి విడుదల చేసే అవకాశం ఏమైనా ఉందా అనే బజ్ ప్రస్తుతం విజయ్ ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో కొనసాగుతోంది. మరి ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటనేది పక్కాగా తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు