‘ఎఫ్ 3’ నుంచి బిగ్ సర్ ప్రైజ్.. ‘బ్లాస్టింగ్ అంటున్న టీమ్ !

Published on May 1, 2022 6:00 pm IST

విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న క్రమంలో ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. రేపు ఉద‌యం 10.08 నిమిషాల‌కు ‘బ్లాస్టింగ్ టుమారో’ అంటూ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో రేపు టీజర్‌ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. తన ఎనర్జిటిక్ సాంగ్స్ తో సినిమా స్థాయిని పెంచుతున్నాడు దేవి. ఈ సినిమా స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి

సంబంధిత సమాచారం :