భారీ సినిమా “బ్రహ్మాస్త్రం” ట్రైలర్ కి రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on May 31, 2022 7:12 pm IST

బాలీవుడ్ ఫిలిం మేకర్ అయాన్ ముఖర్జీ బాలీవుడ్ స్టార్ నటులు రణబీర్ కపూర్ మరియు స్టార్ హీరోయిన్ ఆలియా భట్ లు నటించిన లేటెస్ట్ చిత్రం “బ్రహ్మాస్త్ర” అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎప్పుడు నుంచో మంచి హైప్ తో ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ఆల్రెడీ డేట్ ఫిక్స్ కాగా మేకర్స్ అప్పుడే ప్రమోషన్స్ ని పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసేసారు. మరి ఈరోజు నుంచే అవి స్టార్ట్ కాగా మేకర్స్ ఈ సినిమా మాసివ్ ట్రైలర్ పై బిగ్గెస్ట్ అప్డేట్ ని అందించారు.

ఈ భారీ విజువల్ వండర్ నుంచి ట్రైలర్ ని ఈ జూన్ 15న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పుడు అనౌన్స్ చేశారు. మరి ఈ సాలిడ్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో మన టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటించారు. అలాగే మరింత మంది బాలీవుడ్ స్టార్ నటులు కూడా నటించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అయితే ఈ సినిమా ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ టై అప్ అయ్యి సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :