“కేజీయఫ్ 3” పై బిగ్ క్లారిటీ..షూట్ కి కూడా టైం ఫిక్స్.!

Published on May 14, 2022 4:00 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ ఇండియన్ హిట్ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2”. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రంకి మూడో సినిమా కూడా ఉంటుంది అని ఈ చిత్రంలో హింట్ ఇవ్వగా ఆడియెన్స్ మరింత క్రేజీగా ఫీల్ అయ్యారు.

అయితే అది ఎంతవరకు నిజం? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ సినిమా అనే వారికి బిగ్ క్లారిటీని ఈ సినిమా నిర్మాతలు ఇచ్చినట్టు ఇప్పుడు తెలుస్తుంది. “కేజీయఫ్ 2” కి సీక్వెల్ గా “కేజీయఫ్ 3” ఉందన్న మాట నిజం అని బిగ్ క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ఈ సినిమా షూట్ కూడా ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేస్తామని అది అక్టోబర్ లో ఉండొచ్చని తెలియజేసారు. దీనితో ఈ సెన్సేషనల్ సినిమాపై అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. ఇక అలాగే ఈ సినిమా ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో కూడా చూడాలి.

సంబంధిత సమాచారం :