మణిరత్నం ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్.!

Published on Sep 19, 2021 10:26 am IST

ఇండియన్ టాప్ క్లాస్ దర్శకుడు మణిరత్నం ఇప్పుడు ఓ భారీ చిత్రం “పొన్నియన్ సెల్వన్” తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా అందులోని దర్శకుడు మణిరత్నం నుంచి ఈ సినిమా అనేసరికి అంచనాలు అన్ని వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. చియాన్ విక్రమ్ హీరోగా కార్తీ, ఐశ్వర్య రాయ్, ఇలా ఎంతో మంది అగ్ర తారాగణం నటిస్తున్న ఈ భారీ చిత్రంపై ఇప్పుడు అధికారిక అప్డేట్ వచ్చింది.

రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ భారీ హిస్టారికల్ చిత్రం మొదటి భాగం తాజాగా షూట్ అంతా కంప్లీట్ చేసుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అంతే కాకుండా ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం :