నాగ చైతన్య “కస్టడీ” నుండి రేపు బిగ్ అప్డేట్!

Published on Mar 12, 2023 10:42 pm IST


కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తమిళ – తెలుగు ద్విభాషా చిత్రం కస్టడీ. ఈ చిత్రం లో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

టీమ్ రేపు సాయంత్రం 06:49 గంటలకు భారీ ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ బిగ్ అప్డేట్ కోసం ప్రేక్షకులను సిద్ధంగా ఉండాలని ప్రొడక్షన్ టీమ్ కోరింది. ఈ అప్డేట్ సినిమా టీజర్‌కి సంబంధించినది కావచ్చు. దీనిపై రేపు క్లారిటీ రానుంది. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తుండగా, ప్రియమణి పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది. శరత్‌కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రెండు భాషల్లో మే 12, 2023న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :