“ఎన్టీఆర్ 30” నుంచి బిగ్ అప్డేట్ రెడీ?

Published on Mar 5, 2023 12:00 pm IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివతో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ భారీ సినిమా అనౌన్స్ అయ్యి చాలా కాలం అయ్యింది. అలాగే ఇంకా షూటింగ్ అయితే మొదలు కావాల్సి ఉంది. మరి ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ మధ్యలో పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా అందించారు. ఇక ఇప్పుడైతే వాటి తర్వాత ఫైనల్ గా మరో బిగ్ అప్డేట్ ని అయితే మేకర్స్ రివీల్ చేయనున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ జాన్వీ జాపూర్ అయితే ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈమెపై అయితే మేకర్స్ ఈ మార్చ్ 6న తన బర్త్ డే సందర్భంగా అధికారిక అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి దీనిపై అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ పతాకంపై నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :