‘మోడరన్ లవ్’ తో ఎంట్రీ ఇస్తోన్న బిగ్ బాస్ ‘అభిజీత్’

Published on Jun 23, 2022 4:00 pm IST

టాలీవుడ్ సినిమా పరిశ్రమకి శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ ద్వారా పరిచయమైన యువ నటుడు అభిజీత్ దుద్దాల. ఆ మూవీ అప్పట్లో మంచి సక్సెస్ కొట్టడంతో పాటు నటుడిగా అభిజీత్ కి బాగా పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత రామ్ లీల, మిర్చి లాంటి కుర్రాడు మూవీస్ చేసిన అభిజీత్, ఇటీవల స్టార్ మాలో ప్రసారమైన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో టైటిల్ విన్నర్ గా నిలిచాడు. దానితో ఆయనకు మరింతగా క్రేజ్ లభించింది. అయితే అప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని అభిజీత్, లేటెస్ట్ గా మోడరన్ లవ్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

హాలీవుడ్ లో సూపర్ క్రేజ్ దక్కించుకున్న మోడరన్ లవ్ సిరీస్ ని ఇటు ఇండియాలో హిందీ వర్షన్ లో మోడరన్ లవ్ ముంబై పేరుతో తీయగా, ప్రస్తుతం తెలుగులో కూడా మోడరన్ లవ్ హైదరాబాద్ పేరుతో దానిని చిత్రీకరించారు. ఇక ఈ సిరీస్ ప్రముఖ ఒటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా జులై 8 నుండి ప్రేక్షకులకి అందుబాటులోకి రానుంది. రేవతి, సుహాసిని, ఆదిపినిశెట్టి, మాళవిక నాయర్, రీతువర్మ తదితరులు నటించిన ఈ క్రేజీ సిరీస్ ని యువ దర్శకులు నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక తదితరులు తెరకెక్కించగా, విభిన్న మనస్థత్వాల వ్యక్తుల జీవితాలలో జరిగే ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ద్వారా కొంత గ్యాప్ తరువాత ఎంట్రీ ఇస్తున్న అభిజీత్ ఎంత మేర ఆడియన్స్ నుండి పేరు దక్కించుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :