“RRR” నాటు బీట్ కి “బిగ్ బాస్ 4” కంటెస్టెంట్స్ మాస్ డాన్స్.!

“RRR” నాటు బీట్ కి “బిగ్ బాస్ 4” కంటెస్టెంట్స్ మాస్ డాన్స్.!

Published on Nov 14, 2021 7:00 PM IST


భారీ అంచనాలతో రిలీజ్ కి రెడీగా ఉన్న పాన్ ఇండియన్ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తీసిన చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. మరి ఈ చిత్రం నుంచి గత కొన్ని రోజులు కితం వచ్చిన మాస్ బీట్ “నాటు నాటు” పెద్ద చార్ట్ బస్టర్ అయ్యింది. ఇంకా ఆఫ్ లైన్ లో ఈ సాంగ్ రీచ్ అయితే ఇంకో లెవెల్లో ఉంది.

అంతలా వైరల్ అవుతున్న ఈ సాంగ్ కి బిగ్ బాస్ గత సీజన్లో కంటెస్టెంట్స్ అయినటివంటి సోహెల్ మరియు మెహబూబ్ దిల్ సే లు కూడా మాస్ డాన్స్ చేశారు. మరి ఈ బిట్ నే “RRR” యూనిట్ వారు తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. దీనితో ఇది కూడా వైరల్ అవుతుంది. ఇక అలాగే సోహెల్ మరియు మెహబూబ్ లు తమ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు