బిగ్‌బాస్-5 కంటెస్టెంట్స్ కొత్త లిస్ట్ ఇదే..!

Published on Aug 20, 2021 1:00 am IST

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ 5 త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్‌కు ఎవరు హోస్ట్‌గా వస్తారో అనే సందిగ్ధతకు కూడా మొన్న విడుదలైన ప్రోమోతో తెరపడింది. “బోర్‌డ‌మ్‌కు చెప్పేయ్ గుడ్‌బై.. వ‌చ్చేస్తుంది బిగ్‌బాస్‌ తెలుగు సీజ‌న్ 5” అంటూ మరోసారి నాగార్జునే హోస్ట్‌గా రాబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక దాదాపు పూర్తయ్యిందని, ఆగస్ట్‌ 22 నుంచి హౌస్‌లోకి వెళ్లబోయే కంటెస్టెంట్లందరిని క్వారంటైన్‌కు పంపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఎప్పటిలాగానే ఈ సీజన్‌ కంటెస్టెంట్స్‌ వీరే అంటూ ఇప్పటికే పలువురు పేర్లు జాబితాల్లోకి చేరిపోయాయి. కాగా ఇప్పుడు ఆ జాబితాల్లో మరికొందరి పేర్లు యాడ్ అయినట్టు తెలుస్తుంది. కొత్త జాబితా ప్రకారం యాంకర్‌ రవి, ఆర్‌జే కాజల్‌, శ్వేతా వర్మ, లహరి షారి, కమెడియన్‌ లోబో, సిరి హన్మంతు, నటి ప్రియ, నటుడు సన్నీ, కార్తీకదీపం ఉమాదేవి, 7 ఆర్ట్స్‌ సరయు, మోడల్‌ జస్వంత్‌, నటుడు మానస్‌ షా, విశ్వ, టీవీ9 యాంకర్‌ ప్రత్యూష, ఆట సందీప్‌, రఘు మాస్టర్ల పేర్లు వచ్చి చేరాయి. మరీ ఈ లిస్ట్‌లో ఉన్న పేర్లలో ఎంత మంది పేర్లు అఫిషియల్ జాబితాలో ఉంటాయో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :