అవకాశం వస్తే మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తానంటున్న విశ్వ..!

అవకాశం వస్తే మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తానంటున్న విశ్వ..!

Published on Nov 14, 2021 12:21 AM IST


బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు నుంచి గత వారం విశ్వ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 9 వారాలు హౌస్‌లో ఉన్న విశ్వ అనుకున్నదానికంటే ఎక్కువగానే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసి హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా తన అభిమానుల కోసం థ్యాంక్స్ మీట్ పెట్టుకున్న విశ్వ బిగ్‌బాస్ హౌస్ నుండి బయటికి రావడం నాకు షాకింగ్‌గానే ఉందని, హౌస్ లో ఉంటే ఇంకా బాగా ఆడే వాడినేమో, ఏదేమైనా ప్రేక్షకుల ఓటింగ్ ను నేను స్వాగతిస్తానని, అవకాశం ఉంటే మళ్లీ నేను హౌస్ లోకి వెళ్ళడానికి రెడీ అని అన్నారు.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నా ప్రయాణం 2002లో మొదలయ్యింది. 2004లో నా మొదటి సినిమా పెళ్ళికొసం విడుదల అయ్యింది. అదే ఏడాదిలో విడుదలైన విద్యార్థి సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టిందని అన్నారు. బిగ్‌బాస్ హౌస్ లోకి రాకముందు ఒక తెలుగు సినిమా ఒప్పుకున్నానని, ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా బిగ్‌బాస్ నుండి పిలుపు వచ్చిందని, ఈ షో లో పాల్గొనేందుకు ప్రిపేర్ అయ్యి హౌస్ లోకి అడుగుపెట్టానని అన్నారు.

ఇకపోతే శ్రీరామ్ బిగ్‌బాస్ 5 టైటిల్ విన్నర్ అవుతాడన్న నమ్మకం తనకు ఉందని, అతడి ఆట నాకు బాగా నచ్చుతుందని అన్నారు. నా దృష్టిలో టాప్ 5 కంటెస్టెంట్స్ శ్రీరామ్, రవి, సన్నీ, షణ్ముక్, సిరి అని చెప్పుకొచ్చారు. బిగ్‌బాస్ వల్ల నాకు లోబో రూపంలో మంచి ఫ్రెండ్ దిరికాడని, నాకు సిస్టర్స్ లేరని సరయు బెస్ట్ సిస్టర్ అయ్యిందని అన్నారు. ఇక కెరిర్ దృష్ట్యా మంచి కథలు వింటున్నానని, హీరోగా అవకాశం వస్తే చెయ్యడానికి రెడీగా ఉన్నానని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు