బిగ్‌బాస్ 5: ఈ వీక్ ఎలిమినేట్ లిస్ట్‌లో ఉన్నది ఎవరంటే?

Published on Sep 10, 2021 2:58 am IST

బిగ్‌బాస్ ఐదో సీజన్ ప్రారంభమైన తొలి రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య గొడవలు ప్రారంభమవ్వడంతో హౌస్ మొత్తం రసవత్తరంగా అనిపిస్తుంది. ఫస్ట్‌ వీక్‌ జరిగిన నామినేషన్‌లో రవి, సరయూ, కాజల్‌, మానస్‌, హమీదా, జెస్సీలు ఉన్నారు. అయితే అసలు తొలివారం, తొలి ఎలిమినేషన్‌ ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నామినేట్ అయిన ఈ ఆరుగురిలో మోడల్‌ జెస్సీ(జస్వంత్‌) ఈ వారం ఎలిమినేట్‌ కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

అయితే ఇప్పటివరకు అందరికంటే తక్కువ ఓట్లు జెస్సీకే వచ్చాయని తెలుస్తుంది. నామినేషన్‌లో ఉన్న వారందరిలో జెస్సీ ప్రవర్తన ఒక్కటే ప్రేక్షకులకు నచ్చడం లేదని ఖచ్చితంగా తొలి వారం ఎలిమినేట్ అయ్యేది జెస్సీనే అని అంటున్నారు. మరీ అందరూ అనుకున్నట్టుగ్గా జెస్సీ ఎలిమినేట్ అవుతాడా లేక మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడా అనేది తెలియాలంటే ఈ ఆదివారం వరకు వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :