బిగ్‌బాస్ 5: ప్గస్ట్ వీక్ నామినేట్ అయ్యింది వీరే..!

Published on Sep 7, 2021 2:51 am IST

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులో ఐదో సీజన్ ఎనర్జిటిక్ ప్రీమియర్ ఎపిసోడ్‌తో మొన్న ఆదివారం ప్రారంభమయ్యింది. హౌస్‌లోకి మొత్తం 19 మంది సభ్యులు వెళ్ళారు. అయితే ప్రతి సోమవారం నామినేషన్స్ అలాగే ప్రతి ఆదివారం ఎలిమినేషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు మొదటి వారం నామినేషన్ ప్రక్రియ జరిగింది.

అయితే సన్నీ.. షణ్ముఖ్‌, లహరిని నామినేట్ చేయగా, మానస్‌.. విశ్వ, సరయూను; సిరి.. హమీదా, ప్రియను; ప్రియాంక సింగ్‌.. షణ్ముఖ్‌, హమీదాలను; కాజల్‌.. సరయూ, ఉమాదేవిని; ప్రియ.. సిరి, కాజల్‌ను; లహరి.. హమీదా, కాజల్‌ను నామినేట్‌ చేశారు. దీంతో ఎక్కువ మంది సభ్యులు నామినేట్ చేసిన పేర్లలో కాజల్‌, హమీదా, జెస్సీ, రవి, మానస్‌, సరయూలు ఉన్నారు. దీంతో ఈ ఆరుగురు నామినేషన్ జోన్‌లోకి వచ్చినట్టు బిగ్‌బాస్ తెలిపాడు. మరీ ఈ ఆరుగురిలో మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :