బిగ్ బాస్ 5: త్వరలో హోస్ట్ పై అధికారిక ప్రకటన!?

big boss
బుల్లితెర ప్రేక్షకులు ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ రియాలిటీ షో ఆగస్ట్ లో ప్రారంభం కానుంది. అయితే ఈ రియాలిటీ షో కోసం యాజమాన్యం ఇప్పటి నుండి సెలబ్రిటీ లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బిగ్ బాస్ 5 పై చర్చ మొదలైనప్పటి నుండి ఈ కార్యక్రమం కి ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారు అనే దాని పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.

నాగార్జున గత సీజన్ లో వ్యాఖ్యాత గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ స్థానం లోకి దగ్గుబాటి రానా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అక్కినేని నాగార్జున ప్రస్తుతం బిజీ గా ఉండటం వలన ఈ చర్చలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే రానా ను సంప్రదించినట్లు, రానా కూడా హోస్ట్ గా వ్యవహరించేందుకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీని పై త్వరలో మేకర్స్ ఒక అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version