ఫోటో మూమెంట్ : నాగ్ తో కార్ డ్రైవ్ లో “బిగ్ బాస్ 5” ఈ లేడీ కంటెస్టెంట్.!

Published on May 8, 2022 5:30 pm IST


మన తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర అతి పెద్ద రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ఇప్పటి వరకు 5 సీజన్లను పూర్తి చేసుకొని ఇప్పుడు ఓటిటి లో కూడా కొనసాగుతుంది. అయితే గత సీజన్లో కూడా అంతకు ముందు లానే పలువురు కంటెస్టెంట్స్ లు షో అనంతరం మంచి క్రేజ్ ను తెచ్చుకున్నారు. అలా తెచ్చుకున్న వారిలో గ్లామరస్ లేడీ కంటెస్టెంట్ అయినటువంటి లహరి షరి కూడా ఒకరు.

మరి ఈమె షో సగం లోనే బయటకి వచ్చినా మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. అయితే తాజాగా ఆ షో హోస్ట్ అయినటువంటి కింగ్ నాగార్జునను చాలా కాలం తర్వాత కలిసినట్టుగా ఒక ఫోటో షేర్ చేసింది. అంతే కాకుండా తర్వాత నాగ్ తో ఒక కార్ డ్రైవ్ కి వెళ్లినట్టు కూడా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. నాగ్ నే ఆ కార్ డ్రైవ్ చెయ్యగా తనతో కలిసి ఆ రైడ్ హ్యాపీగా సాగినట్టు తాను తెలిపింది. దీనితో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :