బిగ్‌బాస్: 8 వారాలకు లోబో గట్టిగానే వెనకాశాడుగా..!

Published on Nov 2, 2021 2:10 am IST


బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్ గురుంచి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఈ షోలో అడుగుపెట్టారంటే ఏ చిన్న సెలబ్రెటీకైనా అవకాశాలు అంది వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గతంలో బిగ్‌బాస్‌ షో తనకు నచ్చదని మాట్లాడిన లోబో ఐదో సీజన్‌లో హౌస్‌లోకి వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచాడు. హౌస్‌లోని సభ్యులందరిని తనదైన కామెడీతో నవ్విస్తూ ప్రేక్షకులను బాగానే అలరించిన లోబో 8 వారాలకే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చేశాడు.

అయితే అసలు బిగ్‌బాస్‌ నుంచి లోబోకు ఎంత రెమ్యునరేషన్ వచ్చిందన్నది ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. లోబో వారానికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు తీసుకున్నాడని, ఎనిమిది వారాలకు గాను దాదాపుగా 15 లక్షల వరకు వెనకేసినట్టు టాక్ నడుస్తుంది. అయితే హౌస్‌లో లోబో చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు అనుకున్న దాని కంటే కాసింత ఎక్కువగానే లోబోకి ముట్టచెప్పినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More