బిగ్ బాస్ 5: ఈ వారం నామినేషన్లు ఇవే!

Published on Nov 8, 2021 3:00 pm IST

స్టార్ మా లో ప్రసారం అవుతున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నిన్న విశ్వ ఎలిమినేట్ కావడం తో కాజల్ సేవ్ అయ్యింది. ఈ విషయం హౌజ్ లోని చాలా మంది సభ్యులను దిగ్భ్రాంతి కి గురి చేసింది అని చెప్పాలి.

ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ లో ప్రస్తుతం రవి, సన్ని, కాజల్, మానస్ మరియు సిరి ల లో ఎవరు సేవ్ అవుతారు అనేది తెలియాలంటే షో చూడాల్సిందే. ప్రస్తుతం చూస్తే కాజల్ తక్కువ ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉందని చెప్పాలి. అయితే ఈ వారం వీరిలో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మరింత ఆసక్తి గా మారింది.

సంబంధిత సమాచారం :