బిగ్‌బాస్ 5: ఈ వారం డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు..!

Published on Oct 1, 2021 9:54 pm IST


బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 5 రసవత్తరంగా జరుగుతుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లోపలికి వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుతం హౌస్‌లో 16 మంది సభ్యులు ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్‌కు నటరాజ్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, ఆనీలు నామినేషన్‌లో ఉన్నారు. అయితే ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే అనధికారిక పోల్స్‌లో ఎక్కువ ఓట్లు సాధిస్తూ నెంబర్‌ వన్‌ స్థానంలో వీజే సన్నీ నిలిచాడని, ప్రియకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి సపోర్ట్‌ లభిస్తుందని తెలుస్తుంది. యాంకర్ రవి మూడో స్థానంలో ఉండగా, సిరి హన్మంత్‌, ఆర్జే కాజల్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక నిన్నటివరకు లోబో డేంజర్‌ జోన్‌లో ఉండగా, బిగ్‌బాస్ లోబోకు కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ ఇవ్వడంతో ఒక్కసారిగా అతడికి ఓట్లు పెరిగినట్లు సమాచారం. ఇక యానీ, నటరాజ్‌ మాస్టర్‌లలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సోషల్‌ మీడియాలో వీళ్లిద్దరికి తక్కువ ఫాలోయింగ్‌ ఉండడంతో మిగిలిన అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చాయని టాక్ వినిపిస్తుంది. ఈ వారం ఈ ఇద్దరు కొరియోగ్రాఫర్‌లలో ఎవరో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళతారా? లేక వేరే వారు వెళతారా? అనేది చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :