నా కొడుక్కి ఎవరి సపోర్ట్ లేదు.. ఎమోషన్ అయిన జెస్సీ తల్లి..!

Published on Sep 11, 2021 2:36 am IST


ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాస్ 5 తెలుగు ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న మోడల్‌ జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ ఈ పేరు జనాలకు పెద్దగా పరిచయం లేదు. మోడలింగ్‌ రంగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జెస్సీ హౌస్‌లోకి వచ్చిన తొలివారంలోనే నామినేషన్స్‌లోకి వచ్చాడు. అంతేకాదు ఈ వారం ఎలిమినేట్‌ లిస్ట్‌లో ఉన్నది జెస్సీనే అని ప్రచారం జరుగుతుంది.

అయితే తాజాగా జెస్సీ తల్లి సునీత ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషన్ అయ్యారు. జెస్సీ చాలా అమాయకుడని, కానీ చాలా యాక్టివ్‌గా ఉంటాడని అన్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నది జెస్సీ డ్రీమ్ అని, బిగ్‌బాస్‌లోకి వెళ్లడం ద్వారా మంచి మార్గం దొరికిందని అనుకున్నాడని కానీ తొలి వారమే నామినేషన్‌లోకి రావడంతో కాస్త డిస్టర్బ్ అయ్యాడని చెప్పింది. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా, ఎవరి సపోర్ట్ లేకుండా ఇక్కడివరకు వచ్చాడని అన్నారు. జెస్సీకి ఇప్పుడు మీ అందరి సపోర్ట్ కావాలని, ఖచ్చితంగా జెస్సీ టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నానని ఎమోషనల్ అయ్యింది.

సంబంధిత సమాచారం :