‘బిగ్ బాస్ 5’..తనకి తానే వరస్ట్ పెర్ఫామర్ గా డిక్లేర్..

Published on Sep 24, 2021 4:12 pm IST


ప్రస్తుతం తెలుగు స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో రోజులు వారాలు గడుస్తున్నా కొద్దీ మరింత రసవత్తరంగా మారుతుంది. మరి హౌస్ లో అందరూ కలిసి ఉన్నా ఏదొక సందర్భంలో వారికి చిన్న క్లాష్ వచ్చే మూమెంట్స్ తప్పకుండా ఉంటాయి మరి అలాంటి మూమెంట్ నే ఈసారి ఎపిసోడ్ లో డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది.

ఈరోజు వచ్చిన లేటెస్ట్ ప్రోమోలో అందరి మాటలు అన్నీ అయ్యాయి బానే ఉంది కానీ బిగ్ బాస్ నుంచి హౌస్ మేట్స్ కి ఒక సందేశం వచ్చాక అంతా హీట్ ఎక్కింది. టీం సభ్యులలో ఎవరు వరస్ట్ పెర్ఫామర్ అనేది ఒకరి విషయంలో మరొకరు చెప్పాలి అనగా మానస్ తనకి తానే వరస్ట్ పెర్ఫామర్ గా అనుకుంటున్నాను అని తనకి తానే డిక్లేర్ చేసుకొని నామినేట్ అవుతా అన్నాడు.

ఇది ఒకెత్తు అయితే ఈ నిర్ణయానికి జెస్సి అభ్యంతరం చెప్పాడు అలా ఎలా ఉంటుంది అని. దానితో వెంటనే మానస్ నేను జెస్సి ని నామినేట్ చేస్తున్నానని వెంటనే చెప్పేసాడు. దీనితో మరింత హీటెక్కింది. ఇప్పుడు దీనికోసమే బిగ్ బాస్ వీక్షకులు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కొట్టుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :