బిగ్‌బాస్ 5: ఈ వారం నామినేషన్‌లో ఉంది వీళ్లేనా?

Published on Oct 4, 2021 9:39 pm IST


బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 5 అప్పుడే ఐదో వారంలోకి ఎంటర్ అయ్యింది. అయితే ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో 15 మంది సభ్యులు ఉన్నారు.

అయితే ఈ వారం ఎవరెవరు నామినేషన్‌లోకి రాబోతున్నారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొనగా, ఈ సారి కంటెస్టెంట్స్ కన్‌ఫెషన్ రూమ్ లో పర్స్‌నల్‌గా హౌస్ సభ్యులను నామినేట్ చేశారు. అయితే ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్ళేందుకు నామినేట్ అయిన వారిలో లోబో, విశ్వ, హమీద, జెస్సీ, షణ్ముఖ్, మానస్, రవి, సన్నీ, ప్రియా ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ వారంలో జబర్దస్త్‌కి చెందిన ఓ వ్యక్తి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు టాక్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :