బిగ్‌బాస్ 5: ఈ వారం సేఫ్ జోన్, డేంజర్ జోన్‌లో ఉన్నది ఎవరంటే?

Published on Oct 7, 2021 4:04 am IST


బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 5 అప్పుడే ఐదో వారంలోకి ఎంటర్ అయ్యింది. అయితే ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో 15 మంది సభ్యులు ఉన్నారు.

అయితే ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి ఏకంగా 9 మంది ఇంటి సభ్యులు నామినేట్ కాగా వీరిలో కొందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండగా, మరికొందరు వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే ఈ 9 మందిలో ఈ వారం ఎవరు ఇంటి నుంచి బయటికి వెళ్లబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ నడుస్తున్న తీరును బట్టి చూస్తుంటే యాంకర్ రవి, విజే సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్, మానస్, ప్రియ సేఫ్ జోన్‌లో ఉన్నారని, జెస్సీ, హమీద, విశ్వ, లోబో డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం లోబోకు అందరికంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఈ వీక్ అతడే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :