బిగ్‌బాస్ 5: యాంకర్ రవికి టిక్‌టాక్ స్టార్ ఫుల్ సపోర్ట్..!

Published on Sep 25, 2021 7:56 pm IST


టిక్‌టాక్ ద్వారా బాగా పాపులారిటీని తెచ్చుకున్న వారిలో దుర్గారావు ఒకరు. ‘నాది నెక్కిలీసు గొలుసు’ అనే పాటకు దుర్గారావు తన భార్యతో కలిసి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. టిక్‌టాక్ బ్యాన్ అయ్యాక కూడా బుల్లితెర షోలలో కనిపించి అక్కడ కూడా తనదైన డ్యాన్సులతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో దుర్గారావు కూడా కంటెస్టెంట్‌గా ఉండనున్నాడని తెగ ప్రచారం జరిగింది.

అయితే తనకు బిగ్‌బాస్‌ షో నుంచి పిలుపు వచ్చిందని దుర్గారావు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. కానీ ఈ సీజన్‌లోకి దుర్గారావు మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు. అయితే తాజాగా బిగ్‌బాస్ ఐదో సీజన్‌పై మాట్లాడిన దుర్గారావు తన సపోర్ట్ ఎవరికో చెప్పేశాడు. తాను యాంకర్ రవి కోసమే బిగ్‌బాస్ ప్రస్తుత సీజన్ చూస్తున్నానని, నేను మహేశ్‌బాబు అభిమానినని, రవి అందం, నవ్వు తనకు మహేశ్ బాబులాగానే కనిపిస్తాడని అన్నారు. నా ఫుల్‌ సపోర్ట్‌ రవిగారికే అని అతడంటే నాకు, నా భార్యకు చాలా ఇష్టమని దుర్గారావు అన్నారు.

సంబంధిత సమాచారం :