బిగ్ బాస్ 5 టైటిల్ విజేత గా నిలిచిన సన్నీ కి వరుస సినిమా ఆఫర్స్!

Published on Dec 20, 2021 9:30 pm IST


బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఐదవ సీజన్ ముగిసింది. ఈ షో లో సన్నీ టైటిల్ విజేత గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. సన్నీ టైటిల్ విజేత గా నిలవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక అతనికి తన ఇంటి వద్ద ఘన స్వాగతం లభించింది.

టైటిల్ విజేతగా మాత్రమే కాకుండా, తన ఆట తీరుతో ఆకట్టుకున్న సన్ని కి పలు సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. అంతేకాక స్టార్ మా లో ఒక టివి షో కి వ్యాఖ్యాత గా చేసే అవకాశం రావడం విశేషం. ఇంత క్రేజ్ సొంతం చేసుకున్న సన్ని, తన అవకాశాలను ఎలా ఉపయోగించుకుంటాడు అనేది చూడాలి. బిగ్ బాస్ నుండి వెళ్లిన ఎంతోమంది పలు అవకాశాలు దక్కించుకున్నారు.

సంబంధిత సమాచారం :