బిగ్‌బాస్ 5 విన్నర్ సన్నీకి మ్యారెజ్ ప్రపోజల్.. 100 కోట్ల కట్నం ఆఫర్..!

Published on Dec 29, 2021 1:02 am IST

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్‌గా నిలిచిన సన్నీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీ చివరకు ట్రోపీనీ గెలుచుకుని బయటకు వచ్చాడు. టైటిల్ విజేతగా మాత్రమే కాకుండా, తన ఆట తీరుతో ఆకట్టుకున్న సన్నీకి పలు సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి.

ఇదిలా ఉంటే సన్నీకి తాజాగా ఓ మ్యారేజ్ ప్రపోజల్ కూడా వచ్చింది. అమెరికా నుంచి ఓ ఎన్నారై మహిళ సన్నీకి వీడియో కాల్‌ చేసి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగింది. అంతేకాకుండా కట్నంగా 100కోట్లు ఇస్తానని చెప్పింది. అయితే దీనికి ‘నన్ను భరించాలంటే చాలా ఓర్పు ఉండాలి. మీరు ఆ మాట అన్నారు చాలు’ అంటూ సన్నీ బదులిచ్చాడు. ఈ ఆన్సర్ విన్న ఆ ఎన్నారై నేను సీరియస్‌గానే అడుగుతున్నానని లైవ్‌లోనే పెళ్లి సంబంధం మాట్లాడింది. ప్రస్తుతం ఈ మ్యారేజ్ ప్రపోజల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం :