లగ్జరీ కారు కొన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ విశ్వ.. నెటిజన్ల ట్రోల్స్..!

Published on Nov 27, 2021 12:58 am IST


బిగ్‌బాస్‌ సీజన్ 5 కంటెస్టెంట్ విశ్వ తాజాగా కొత్త లగ్జరీ కారును కొన్నాడు. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా విశ్వ పేరు తెచ్చుకున్నప్పటికీ తొమ్మిదో వారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చేశాడు. అయితే తాజాగా అతడు లగ్జరీ కారును కొన్నట్టు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. నా జీవితంలోకి కొత్త ఫ్యామిలీ మెంబర్‌ వచ్చింది. కలలు కన్న కారును కొంటే ఆ ఆనందమే వేరు. నేను ఎంతగానో ఇష్టపడే కారును కొని నా కలను నెరవేర్చుకున్నానని, దీనికి కారణమైన ఆ దేవుడికి, బిగ్‌బాస్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని విశ్వ చెప్పుకొచ్చాడు.

అయితే అంతా బాగానే ఉంది కానీ హౌస్‌లో ఉన్నప్పుడు విశ్వ లాక్‌డౌన్‌లో తన కూతురు స్కూలు ఫీజు కట్టడానికి కూడా డబ్బుల్లేవని చెప్పి ఏడ్చిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడేమో స్కూలు ఫీజు కట్టలేనని ఏడ్చి, ఇప్పుడు ఇలా లగ్జరీ కారును ఎందుకు కొన్నావంటూ కొందరు నెటిజన్లు విశ్వపై ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మరికొందరేమో బిగ్‌బాస్‌తో విశ్వ రేంజ్‌ మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :