బిగ్‌బాస్: విశ్వ మొత్తంగా ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే?

Published on Nov 8, 2021 10:02 pm IST

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 5 అప్పుడే పదో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత వర్మ, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, రీసెంట్‌గా విశ్వ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హౌస్‌లో 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు.

అయితే హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరున్న విశ్వ మొన్న ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. అయితే అనుకున్నదానికంటే ఎక్కువగానే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన విశ్వ బాగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. విశ్వకు షో నిర్వాహకులు వారానికి రూ. 2-2.5 లక్షల మేర రెమ్యునరేషన్ ఇచ్చారని, ఈ లెక్కన 9 వారాలకు గాను విశ్వ రూ.22.50 లక్షల వరకు అర్జించాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ హౌస్ నుంచి వెళుతూ శ్రీరామచంద్ర విన్నర్ కావాలని విశ్వ కోరుకున్నాడు.

సంబంధిత సమాచారం :

More