బిగ్‌బాస్: యానీ మాస్టర్ మొత్తంగా ఎంత రెమ్యునరేషన్ తీసుకుందంటే?

Published on Nov 23, 2021 1:11 am IST


బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 5 అప్పుడే 11 వారాలను పూర్తి చేసుకుంది. ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత వర్మ, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వ, పదో వారం జశ్వంత్, రీసెంట్‌గా యానీ మాస్టర్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హౌస్‌లో 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు.

అయితే బిగ్‌బాస్ ట్రోఫీ కొట్టాలని హౌస్‌లోకి ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన యానీ ఆశలు నిన్నటితో ఆవిరైపోయాయి. కానీ ఉన్నని రోజులు ప్రేక్షకులను బాగానే ఎంటర్‌టైన్ చేసిన యానీ రెమ్యునరేషన్ మాత్రం బాగానే తీసుకున్నట్టు సమాచారం. యానీకి షో నిర్వాహకులు వారానికి రెండున్నర నుంచి మూడు లక్షల మేర రెమ్యునరేషన్ ఇచ్చారని, ఈ లెక్కన 11 వారాలకు గాను ఆమె రూ.30 లక్షల వరకు తీసుకున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More