“బిగ్ బాస్ 7” : ఆడియెన్స్ కి విసుగు తెప్పిస్తున్న రైతుబిడ్డ ఓవరాక్షన్?

Published on Sep 20, 2023 1:03 pm IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 ఇప్పుడు ఎప్పటిలానే మంచి డ్రామాతో అయితే కొనసాగుతుంది అని చెప్పాలి. గడిచిన రెండు సీజన్లతో పోలిస్తే కాస్త బెటర్ గానే షో కొనసాగుతూ ఉండగా ఈసారి కాస్త బాగా నోటెడ్ కంటెస్టెంట్స్ ని సోషల్ మీడియాలో మంచి బజ్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చారు.

అయితే వీరిలో బిగ్ బాస్ హౌస్ లోకి మంచి ఎమోషనల్ గా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ అని చెప్పాలి. తాను ఓ రైతుబిడ్డని అంటూ పలు ఎమోషనల్ వీడియోస్ పెట్టి బిగ్ బాస్ వరకు చేరాడు. అయితే హౌస్ కి వచ్చిన తర్వాత మాత్రం తన అసలు రంగులు బయటకొస్తున్నాయని అని ఫాలోవర్స్ లో టాక్ వచ్చేసింది.

మరి ఉన్నకొద్దీ ఈ రైతుబిడ్డ లోని కలర్స్ ఆడియెన్స్ కి విసుగు తెప్పిస్తున్నాయి అని అంటున్నారు. ఇంకా నిన్నటి ఎపిసోడ్ లో అయితే రతిక, శివాజీలు ఓ చోట కూచొని ఉన్నపుడు వచ్చి కావాలనే రతికను టచ్ చేస్తూ మాట్లాడుతున్నట్టు అనిపించడం తర్వాత బిగ్ బాస్ పర్శనల్ గా మాట్లాడినపుడు ఏడుస్తూ ఓవర్ గా కావాలనే చేస్తున్నాడా అన్నట్టుగా అనిపించాయి. దీనితో తన వ్యవహారం మాత్రం హౌస్ లో కాస్త వేరుగానే ఉందని ఫాలోవర్స్ అంటున్నారు. మరి ఈ ఎమోషనల్ కంటెస్టెంట్ ఎప్పటివరకు కొనసాగుతాడో చూడాలి.

సంబంధిత సమాచారం :