బిగ్‌బాస్‌ బ్యూటీ సిరికి కరోనా పాజిటివ్‌..!

Published on Jan 18, 2022 2:04 am IST

బిగ్‌బాస్‌ సీజన్ 5 టాప్‌-5 కంటెస్టెంట్‌ సిరి హన్మంతుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సిరి స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియచేసింది. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలిందని సిరి ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ సీజన్‌-5 ముగిసి చాలా రోజులు అవుతున్నా సిరిపై ఇంకా ట్రోలింగ్‌ మాత్రం ఆగడం లేదు. షణ్ముఖ్-దీప్తి సునయనల బ్రేకప్‌కి కారణం సిరినే అని ఆమెని టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో కొందరు పోస్టులు పెడూతున్నారు. అయితే వాటన్నిటిపై రీసెంట్‌గా స్పందించిన సిరి షణ్ముఖ్-దీప్తి సునయనల బ్రేకప్‌కు తాను కారణం కాదని చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :