యాక్షన్ హీరోగా బిగ్‌బాస్ 5 ‘జెస్సీ’.. ఫస్ట్ మూవీ పోస్టర్ రిలీజ్..!

Published on Dec 25, 2021 10:02 pm IST

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ కంటెస్టెంట్ మోడల్‌ జశ్వంత్‌ పడాల (జెస్సీ) గుర్తున్నాడు కదా. అనారోగ్య సమస్యతో పదవ వారంలోనే హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు జెస్సీ. అయితే బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే స్టేజ్‌పై తనకు ఓ సినిమా ఛాన్స్ వచ్చిందని జెస్సీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జెస్సీ ఫస్ట్ సినిమా టైటిల్‌ పోస్టర్ విడుదల అయ్యింది.

“ఎర్రర్‌ 500” అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జెస్సీ యాక్షన్ హీరోగా కనిపించనున్నాడు. పోస్టర్‌లో నెత్తుటి గాయాలతో చేతిలో గన్‌ పట్టుకుని ఎవరినో షూట్ చేస్తున్నట్టుగా ఉంది. మైత్రి మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సందీప్‌ మైత్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :