బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్‌ హైలైట్స్ !

Published on Sep 21, 2021 8:17 am IST


బిగ్ బాస్ హౌస్‌ లో సోమవారం నాడే ఎలిమినేషన్స్‌ కి నామినేషన్స్ ఉంటాయి కాబట్టి, ఆ రోజు హౌస్ లో ఎవరు ఎవరి పట్ల అసంతృప్తిగా ఉన్నారో తెలిసిపోతుంది. ముఖ్యంగా ఒకరి బండారం ఒకరు బయటపెట్టడానికి అందరూ పోటీ పడతారు. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో.. మూడో వారంలో ఎవరెవరు నామినేట్ అయ్యారో అని ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి క్రియేట్ అయింది.

ఇక 14వ రోజు 16వ ఎపిసోడ్‌ హైలైట్స్ లో శ్రీరామ్ – హమీదాలు క్లోజ్ గా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ క్రమంలో ప్రియ, రవిల ఆట తీరు పై చర్చించుకున్నారు. ఇక కాజల్ తో మాట్లాడుతూ విశ్వ, శ్రీరామ్‌లు ప్రవర్తన పై మానస్ ఫీల్ అయ్యాడు. మరో వైపు విశ్వ కూడా తన కష్టాలను షణ్ముఖ్ దగ్గర చెప్పుకుంటూ .. బిగ్ బాస్ లోకి వచ్చే ముందు వరకు కూడా.. డబ్బు కోసం చాలా ఇబ్బంది పడ్డాను అని, నాలుగు నెలలు అద్దె కూడా కట్టలేదని బాధ పడుతుంటే.. షణ్ముఖ్ ఓదార్చాడు.

సంబంధిత సమాచారం :