బిగ్ బాస్ 5: హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన లోబో…ఎమోషనల్ అయిన షణ్ముఖ్!

బిగ్ బాస్ 5: హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన లోబో…ఎమోషనల్ అయిన షణ్ముఖ్!

Published on Oct 21, 2021 4:00 PM IST


స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి పది గంటలకు, శని మరియు ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. ఇప్పటికే ఒకరి పై ఒకరు టాస్క్ లతో పోటాపోటీ గా ఆడుతూ, ఒకరి తో మరొకరు గొడవలు పడుతున్న సమయం లో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు లోబో. లోబో హౌజ్ లోకి రావడం తో రవి సంతోషం వ్యక్తం చేశారు. పరిగెత్తుకుంటూ వచ్చి లోబో ను హత్తుకున్నాడు రవి.

ఇక టాస్క్ ఎఫెక్ట్ షణ్ముఖ్ పై చాలా గట్టిగానే పాడినట్లు తెలుస్తోంది. తనను ఎదవ ని చేశారు అంటూ షణ్ముఖ్ ఎమోషనల్ అవ్వడం మాత్రమే కాకుండా, తన టీమ్ ను సైతం కన్నీరు పెట్టించారు షణ్ముఖ్. తాజాగా విడుదల అయిన ప్రోమో లో షణ్ముఖ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ షో లో ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే నేడు రాత్రి 10 గంటలకు ఎపిసొడ్ చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు