బిగ్ బాస్ నాన్ స్టాప్ డిస్నీ+ హాట్‌స్టార్ లోగో విడుదల!

Published on Feb 9, 2022 11:00 pm IST

బిగ్ బాస్ ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈరోజు శుక్రవారం 9 ఫిబ్రవరి 2022 న దాని లోగోను లాంచ్ చేయడం జరిగింది. బిగ్ బాస్ నాన్ స్టాప్, 24/7 ఎంటర్ టైన్మెంట్, నేరుగా బిగ్ బాస్ హౌస్ నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో కి ఎక్స్ క్లూజీవ్ గా రానున్నట్లు తెలుస్తోంది. ఈ వినోద అద్భుతం అతి త్వరలో మీ చేతుల్లోకి రానుంది. హౌస్‌మేట్స్ యొక్క ఆసక్తికరమైన మిక్స్ మరియు వారిపై మీ నాన్‌స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ను తెలుగు ప్రేక్షకులు తదుపరి స్థాయిలో వినోదాన్ని చూస్తారు.

బిగ్ బాస్ ఈరోజు డిస్నీ+ హాట్‌స్టార్ తెలుగు సోషల్ మీడియా హ్యాండిల్‌లో దాని లోగోను లాంచ్ చేసింది. నీలం మరియు ఎరుపు రంగులు చైతన్యం మరియు ఉత్సుకత యొక్క ప్రాథమిక రంగులను సూచిస్తాయి. డిస్నీ+ హాట్‌స్టార్ ప్రపంచం బిగ్ బాస్ నాన్ స్టాప్‌తో మీ కోసం ఈ సంవత్సరం అతి పెద్ద వినోద అధ్యాయాన్ని తెరుస్తుంది కాబట్టి సిద్ధంగా ఉండండి.

సంబంధిత సమాచారం :