బిగ్‌బాస్ టైటిల్ విన్నర్‌గా “ఆడపులి”..!

Published on May 21, 2022 3:00 am IST


బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్‌ ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. గత సీజన్ల కంటే భిన్నంగా ఏడుగురు కంటెస్టెంట్లతో గ్రాండ్‌ ఫినాలేకి చేరుకుంది బిగ్‌బాస్‌. అయితే బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే అప్‌డేట్స్‌ అప్పుడే సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి. నెట్టింట లీక్‌ అవుతున్న సమాచారం ప్రకారం ఈ సారి బిందు మాధవి బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ టైటిల్‌ విన్నర్‌గా నిలిచినట్టు ప్రచారం జరుగుతుంది. బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారి ఒక అమ్మాయి టైటిల్‌ విన్నర్‌గా నిలవడం బిందుకే సాధ్యమైంది.

కాగా ఈ సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా వచ్చిన బాబా మాస్టర్‌ టాప్7 స్థానంలో నిలవగా, అనిల్‌ 6వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మిత్రా, అరియానా గ్లోరీ, శివ వరుసగా టాప్‌ 3 స్థానాల్లో నిలిచినట్లు టాక్‌. టాప్‌-4లో ఉన్న కంటెస్టెంట్లకు నాగార్జున డబ్బులు ఆఫర్‌ చేయగా అరియానా గ్లోరీ 10 లక్షల బ్రీఫ్‌ కేసును తీసుకొని టైటిల్‌ రేసు నుంచి స్వయంగా తప్పుకుంది. ఆ తర్వాత టాప్‌-3లో ఉండగా మరోసారి డబ్బులు ఆఫర్‌ చేయగా, శివ, బిందు, అఖిల్‌ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. ఫైనల్‌గా బిందు, అఖిల్‌కి మధ్య జరిగిన రేస్‌లో బిందు విజేతగా నిలిచినట్లు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :