బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్: ఈ వారం ఎలిమినేట్ కాబోతుంది అతడేనా?

Published on Apr 17, 2022 1:04 am IST

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో అప్పుడే ఏడు వారాలను పూర్తి కావస్తుంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో నుంచి మొదటి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా.. ఆమె మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక రెండో వారం శ్రీరాపాక, మూడో వారం ఆర్జే చైతూ, నాలుగో వారం సరయు, ఐదో వారం తేజస్వి మదివాడ, ఆరో వారం యాంకర్ స్రవంతి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్ ఇద్దరు హౌస్ నుంచి బయటకొచ్చేశారు.

ఇక ఈ వారం అనిల్‌, నటరాజ్‌, శివ, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్‌, అరియానా, మహేశ్‌ విట్టా నామినేషన్‌లో ఉన్నారు. అయితే ఏడో వారం హౌస్ నుంచి మహేశ్‌ విట్టా ఎలిమినేట్‌ కాబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. నిజానికి ఓట్ల పరంగా మహేశ్ మెరుగైన స్థానంలోనే ఉన్నాడని కానీ కావాలనే అతడిని గేమ్‌ నుంచి తప్పించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే మూడో సీజ్‌లో పాల్గొన్న బాబా భాస్కర్‌ను ఈ వారం వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి పంపించబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :