బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్: ఈ వారం నామినేషన్‌లో ఎవరెవరున్నారంటే?

బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్: ఈ వారం నామినేషన్‌లో ఎవరెవరున్నారంటే?

Published on Apr 12, 2022 3:00 AM IST


బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో అప్పుడే ఆరు వారాలను పూర్తి చేసుకుంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో లో మొదటి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా.. ఆమె మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక రెండో వారం శ్రీరాపాక, మూడో వారం ఆర్జే చైతూ, నాలుగో వారం సరయు, అదో వారం తేజస్వి మదివాడ, ఆరో వారం డబుల్ ఎలిమినేషన్ జరగ్గా యాంకర్ స్రవంతి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్ హౌస్ నుంచి బయటకొచ్చేశారు.

ఇదిలా ఉంటే హౌస్‌లో ఈ వారం కూడా నామినేషన్స్‌ రసవత్తరంగా సాగినట్టు తెలుస్తుంది. అఖిల్‌, బిందుమాధవి, అరియానా, శివ, నటరాజ్‌ మాస్టర్‌, మిత్ర, అనిల్‌ శర్మ, మహేశ్ నామినేషన్‌లోకి రాగా, అషూరెడ్డి తన కెప్టెన్సీ పవర్‌ను సాగిస్తుంది. మరి వీరిలో ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకొచ్చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు