బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఫైనల్‌ విన్నర్‌గా బిందు మాధవి..!

Published on May 21, 2022 11:09 pm IST

‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ షోకు శుభం కార్డు పడింది. మొత్తం 17 మంది సభ్యులతో ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ బిగ్‌ రియాల్టీ షో 83 రోజులు పాటు జరిగింది. ఈ షోలో టాప్ 7 కంటెస్టెంట్స్‌గా మిత్రా శర్మ, బాబా భాస్కర్‌, అనీల్ రాథోడ్, అరియానా గ్లోరి, అఖిల్‌ సార్థక్, యాంకర్ శివ, బిందు మాధవి నిలిచారు. చివరగా వీరిలో టాప్‌ 2 కంటెస్టెంట్స్‌గా అఖిల్‌ సార్థక్, బిందు మాధవి నిలిచారు.

ఇద్దరినీ స్టేజ్‌పైకి తీసుకెళ్లిన నాగార్జున ఫైనల్‌ విన్నర్‌గా బిందు మాధవిని ప్రకటించాడు. దీంతో తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటిసారిగా ఒక మహిళ విన్నర్‌గా గెలిచింది. ఇక బిగ్‌బాస్‌ విన్నర్‌గా కప్‌ కొట్టాలని ఇదివరకు ప్రయత్నించి ఓడిపోయిన అఖిల్‌కు మరోసారి ట్రోఫి దక్కలేదు. ఈ సారి కూడా రన్నర్‌గానే నిలిచాడు.

సంబంధిత సమాచారం :