బిగ్‌బాస్ 5: హమీదా ఐదు వారాల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Published on Oct 12, 2021 3:00 am IST

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 5 అప్పుడే ఆరో వారంలోకి ఎంటర్ అయ్యింది. అయితే ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా మొదటి వారం సరయూ, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కాగా నిన్న హమీద ఎలిమినేట్ అయ్యింది. అయితే తన నవ్వుతో, చూపులతో కుర్రకారు మనసు దోచేసిన ఈ ముద్దుగుమ్మకి సరైన ఫ్యాన్ బేస్ లేకపోవడంతోనే ఓటింగ్‌లో వెనకబడిపోయిందని నెటిజన్లు అంటున్నారు.

అయితే హమీదా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం పక్కనపెడితే ఆమె పారితోషికం ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. ఒక్క వారానికిగానూ హమీదా 80 వేల నుంచి లక్ష రూపాయల మేరకు రెమ్యునరేషన్‌ తీసుకున్నట్టు చర్చ జరుగుతుంది. ఈ లెక్కన ఆమె ఐదు వారాలకుగానూ మొత్తం నాలుగున్నర లక్షలకు పైగానే తీసుకుని వెళ్ళి ఉంటుందని తెలుస్తుంది. హౌస్‌లో ఫుల్ గ్లామరస్‌గా కనిపించిన హమీదాకు ఈ మాత్రం రెమ్యునరేషన్ ఇవ్వడంలో తప్పేంలేదని అంటున్నారు బిగ్‌బాస్ వీక్షకులు.

సంబంధిత సమాచారం :