బిగ్ బాస్ 5: శ్రీరామ చంద్ర కి నచ్చిన క్వాలిటీస్ ఉండే అమ్మాయి!?

Published on Sep 8, 2021 7:18 pm IST


బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాలిటీ షో అయిదవ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ షో లో 19 మంది సభ్యులను ప్రకటించడం జరిగింది. ఇందులో తాజాగా విడుదల చేసిన ప్రోమో లో శ్రీ రామ చంద్ర గురించి ఉండటం విశేషం. శ్రీ రామ చంద్ర కి నచ్చిన క్వాలిటీస్ తో ఉండే అమ్మాయి అంటూ ప్రోమో ను స్టార్ మా విడుదల చేయడం జరిగింది.

తనకు జోవియల్ గా, బబ్లీ గా ఉండటం ఇష్టం అంటూ శ్రీ రామ చంద్ర చెప్పిన మాటలను వీడియో లో చూపించారు. అదే విషయాలను వివరిస్తూ ముచ్చటిస్తున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారం కానుంది. అదే విధంగా శని మరియు ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :