బిగ్ బాస్ లో అసలు ఆట మొదలు…నామినేషన్ల ప్రక్రియ షురూ..!

Published on Sep 6, 2021 6:11 pm IST

బుల్లితెర ప్రేక్షకులను గత నాలుగు సీజన్ ల నుండి అలరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఈ ఏడాది ప్రారంభం అయింది. ఈ ఏడాది కూడా ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ వస్తోంది. నిన్న గ్రాండ్ గా ప్రారంభం అయిన ఈ షో పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో లో మొత్తం 19 మంది సభ్యులు విచ్చేశారు. బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం ఎలాంటి మార్పులు, టాస్క్ లు జరుగుతాయి అనే దాని పై ఆసక్తి నెలకొంది. తాజాగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. షో లో నామినేషన్ ప్రక్రియ షురూ అయినట్లు తెలుస్తోంది. అసలు ఆట మొదలు కావడంతో ఈ షో లో నామినేషన్ ప్రక్రియ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :